3 మిలియన్ల రియాళ్ళ నోట్ల కట్టలను అక్రమరవాణా చేస్తున్న లారీ డ్రైవర్ అరెస్ట్
- April 10, 2017
సాధారణంగా ఇసుకో..ఇటుకో లేదా నిత్యావసరాల వస్తువులనో తరలించే లారీలో అందుకు విభిన్నంగా భారీగా నోట్లకట్టలు పేర్చుకొని హుషారుగా అక్రమ రవాణా చేస్తున్న ఓ లారీ డ్రైవర్ ను సంబంధిత అధికారులు అడ్డుకొన్నారు. మూడు మిలియన్లకు పైగా సౌదీ రియల్స్ డబ్బును యుఎఇ లోకి అక్రమంగా తీసుకువస్తున్న ఆ లారీ డ్రైవర్ ను పట్టుకొని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అబుదాబి సాధారణ పరిపాలన కస్టమ్స్ శాఖ అధికారులు ఆదివారం మాట్లాడుతూ,అబూధాబీ లో ఘువైఫేట్ సరిహద్దు వద్ద ఆ ఆసియా డ్రైవర్ ను పట్టుకున్నట్లు తెలిపారు.ఆ వ్యక్తి సౌదీ అరేబియా దాటి యుఎఇ లోనికి ప్రవేశించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. తనిఖీ అధికారులు లారీని క్షుణ్ణంగా వెతకగా డ్రైవర్ సీటు వెనుక ఒక రహస్య అరలో 3.750.000 రియాళ్ళ నగదు పెద్ద మొత్తంలో దొరికింది. డ్రైవర్ అధికారులకు ఆ నగదు గూర్చి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ లారీ డ్రైవర్ పై చట్టపరమైన చర్య తీసుకొనేందుకు ఉన్నతాధికారులకు సూచించబడింది మరియు కోర్టు తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. చట్ట ప్రకారం,యుఎఇ వెళ్ళేటప్పుడు..లేదా ప్రవేశించేటప్పుడు సందర్శకులు డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువస్తున్నప్పుడు వాటిని ముందుగా నిర్ధారించుకోవాల్సి ఉంది. అంత భారీ నగదు బదిలీ చేయడానికి లక్ష్యం ఏమిటో అధికారులకు వివరించాల్సి ఉంది.అబూధాబీ లో కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ అల్ హమ్మలి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అబుదాబి కస్టమ్స్ అభివృద్ధి మరియు తాజా తనిఖీ విధాన వ్యవస్థలు సంబంధిత ప్రభుత్వ విభాగాల సహకారంతో పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







