అమెరికాలో H4 వీసాల మీద పనిచేస్తున్న వారికి కష్టాలు
- April 10, 2017
అమెరికాలో H4 వీసాల మీద పనిచేస్తున్న వారికి కష్టాలు తప్పేలా లేవు. హెచ్ 1 బీ వీసాలమీద అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములకు వర్క్ వీసాలైన H4 ను అమెరికా ప్రభుత్వం గతంలో ఇచ్చింది. 2015లో హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాముకు వర్క్ వీసాలను జారీచేసింది. దీంతో దాదాపు రెండు లక్షలమందికి పైగా H4 వీసాలపై అమెరికాలో వివిధ ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పట్లోనే కాలిఫోర్నియాకు చెందిన కొందరు ఐటి ఉద్యోగులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించారు. ఈ దావాను 2016లో కింది కోర్టు కొట్టివేయడంతో వీరు పైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసుపై తమకు 60 రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. అయితే ఈ గడువు సోమవారంతో ముగియనుండటంతో... విచారణను మరో ఆరు నెలల వరకు నిలిపివేయాలంటూ ట్రంప్ సర్కారు అప్పీలు కోర్టును కోరింది. ప్రభుత్వ సూచించినట్లు కోర్టు గడువు ఇవ్వకుంటే H4 వీసాలదారులకు గడ్డుకాలమే ఎదురుకానుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







