భారతీయులు వీసా లేకుండా రష్యా వెళ్లొచ్చు
- April 18, 2017రష్యా వెళ్లే భారతీయులకు ఇకపై వీసా అవసరం ఉండదు. ఈ అవకాశాన్ని రష్యా 18 దేశాలకు కల్పించింది. ఇందులో ఇండియా కూడా ఒకటి. ఈ విషయాన్ని ఆదేశ ప్రధానమంత్రి మెద్వెదేవ్ స్వయంగా ప్రకటించారు. ఇండియాతోపాటు యూఏఈ, అల్జీరియా, బహ్రెయిన్, బ్రూనే, కువాయిట్, ఇరాన్, ఖతార్, చైనా, ఉత్తరకొరియా, మొరాకో, మెక్సికో, ఒమన్, సౌదీ అరేబియా, సింగపూర్, ట్యునీసియా, టర్కీ, జపాన్ దేశాల నుంచి రష్యా తూర్పును ఉన్న నగరాలు, పట్టణాలకు వెళ్లే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఈ వెసులుబాటు వర్తించనుంది.
తూర్పు రష్యాలో పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు పర్యాటక రంగ ఆదాయం పెంచుకునే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించే దేశాలతో వీసా-ఫ్రీ ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి వచ్చేవారికి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంతేకాకుండా, ఈ ప్రాంతంలోనే ఉన్న వ్లాడివోస్టోక్ నౌకాశ్రయంలో ఎటువంటి వీసా అవసరం లేకుండా పర్యటించేందుకు మార్చి నుంచి వీలు కల్పించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







