రెడ్ లైట్ జంపర్‌కి జైలు శిక్ష, డిపోర్టేషన్
- April 21, 2017
మనామా: 11 సార్లు రెడ్ లైట్ జంపింగ్‌కి పాల్పడ్డ ఓ లారీ డ్రైవర్‌కి రెండు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే అతన్ని డిపోర్టేషన్ చేయాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నిందితుడికి 500 బహ్రెయినీ దినార్స్ జరీమానాను నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కిగాను విధించారు. జనవరి 22న కింగ్ ఫైసల్ హైవే మీద రెడ్ లైట్ జంప్ చేస్తుండగా నిందితుడ్ని ట్రాఫిక్ కెమెరా గుర్తించింది. అతని రికార్డ్‌ని చెక్ చేయగా, 10 సార్లకు పైగా రెడ్ సిగ్నల్‌ని అతను జంప్ చేసినట్లు విచారణలో తేలింది. దీనికి సంబంధించి అధికారులు నిందితుడికి సమన్లు జారీ చేశారు. అయితే తానెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని నిందితుడు వాదిస్తూ వచ్చాడు. న్యాయస్థానంలో కేసు విచారణ సందర్భంగా నిందితుడు పాల్పడ్డ నేరాన్ని నిరూపించారు. అయితే ముందుగా అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించగా, ఆ తర్వాత ఆ శిక్షను రెండు నెలలకు కుదించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







