ఎగ్ బఠానీ కర్రీ
- April 23, 2017
కావలసిన పదార్థాలు: గుడ్లు -4, టమోటాలు - 3, ఉల్లిపాయ తరుగు - అరకప్పు, పచ్చిబఠాణి - పావుకప్పు, లవంగాలు -4, దాల్చినచెక్క - అరంగుళం ముక్కలు 2, ధనియాల పొడి -అర టీ స్పూను, గరంమసాల - అర టీ స్పూను, పసుపు -పావు టీ స్పూను, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: టమోటాల్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి లవంగాలు, దాల్చినచెక్క, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేగించి పసుపు, టమోటా ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాలపొడి, మసాలపొడి, పచ్చిబఠాణి వేసి మూతపెట్టి సన్నని సెగమీద ఉడికించాలి. బఠాణి మెత్తబడ్డాక గుడ్లని పగలకొట్టి వేయాలి. గరిటతో కలబెట్టకుండా మూతపెట్టి సన్నని సెగ మీద 10 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. అన్నం/ పరాటాలతో ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







