బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో రికార్డ్
- April 24, 2017
ఫార్ములా వన్ గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా రికార్డు సంఖ్యలో ప్రాణీకులు బహ్రెయిన్‌కి ఈ ఏడాది చేరుకున్నట్లు బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ (బిఎఎసి) వెల్లడించింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం 15,041 మంది ప్రయాణీకులు ఈ ఏడాది విచ్చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 16 శాతం అధికం. బహ్రెయిన్‌లో ఫార్ములా వన్ రేసింగ్‌కి సంబంధించి ఇదో సరికొత్త రికార్డు అని బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా 500 మిలియన్ల మంది ఈ ఫార్ములా వన్ రేస్‌ని తిలకించారు. ప్రత్యక్షంగా 100,000 మంది ఈ రేస్‌కి హాజరయ్యారు. కింగ్డమ్ 2030 విజన్‌లో భాగంగా చేపడ్తున్న ఇలాంటి కార్యక్రమాలతో బహ్రెయిన్ ఎకానమీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







