కళాతపస్వి కె. విశ్వనాధ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
- April 24, 2017
తెలుగు సినిమా గౌరవ సూచిక, శంకరాభరణం సృష్టికర్త కె. విశ్వనాధ్ ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 2016 సంవత్సరానికి గాను విశ్వనాధ్ ను ఈ అరుదైన అవార్డుకు ఎంపిక చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 'స్వీట్ అండ్ సాఫ్ట్' సినిమాలకు, సంగీత, సాంస్కృతిక ప్రధానమైన సినిమాలకు మారుపేరనిపించుకున్న కాశీనాధుని విశ్వనాధ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం లభించడం పట్ల దక్షిణాది తెలుగు చిత్రసీమలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. శంకరాభరణం, సాగరసంగమం, సప్తపది, శృతిలయలు, స్వయంకృషి, ఆపద్భాంధవుడు లాంటి చిత్రరాజాలు విశ్వనాధ్ సినిమాల జాబితాలో ఎన్నో వున్నాయి. తన సినిమాలతో అనేక మంది స్టార్ హీరోల స్థాయిని మరింత పెంచిన విశ్వనాధ్ తెలుగువాడవ్వడం మన అదృష్టం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







