అవార్డు వెన్నకి ఇచ్చేస్తున్న అక్షయ్
- April 25, 2017
రుస్తుం సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి కోపం వచ్చింది. తనకు ఈ అవార్డు రావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. దంగల్ మూవీలో ఆమిర్ ఖాన్ కన్నా, అలీగఢ్ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్ కన్నా రుస్తుంలో అక్షయ్ నటన గొప్పగా లేదని కొందరు విమర్శించారు. పైగా అక్షయ్‌కి సన్నిహితుడు, హేరాఫేరి, భాగం భాగ్ వంటి అక్షయ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రియదర్శన్ అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా ఉండడం వల్లే అతనికి ఈ అవార్డు వచ్చిందని మరికొందరు పెదవి విరిచారు.
దీనిపై ఘాటుగా స్పందించిన అక్షయ్..పాతికేళ్ళుగా ఇలాంటి వ్యాఖ్యలు వింటున్నానని , అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ ఈ విధమైన కామెంట్లు వినబడుతున్నాయని అన్నాడు. తనకు 26 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారం లభించిందని, ఇది కూడా మీకు నచ్చకపోతే ఈ అవార్డు వెనక్కి తీసుకోండని తీవ్రంగా వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







