‘గల్ఫ్’ సినిమా అంబాసిడర్ గా ఇందూర్ గల్ఫ్ నాయకుడికి అరుదైన గౌరవం
- April 26, 2017
'గల్ఫ్' సినిమా అంబాసిడర్ గా ఇందూర్ గల్ఫ్ నాయకుడికి అరుదైన గౌరవం దక్కింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల జీవితాలపై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన 'గల్ఫ్' చిత్రం త్వరలో విడుదల కానున్నది. పిడికెడు మెతుకుల కోసం పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? కన్నవారికి, కట్టుకున్నవాళ్లకి దూరంగా బతకాలనుకునే వారు గల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గడుపుతున్నారా? ఇలాంటి ఎన్నో అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ముళ్ల మధ్య గులాబీలు అందంగా వికసించినట్టు వ్యథలే కథగా మిగిలినా అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చూపిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ‘గల్ఫ్’ చిత్రానికి స్థానిక ప్రచార భాద్యతలు నిర్వహించడానికి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రవాసి కార్మిక నాయకుడు బొండల గంగాప్రసాద్ ను ‘గల్ఫ్’ సినిమా అంబాసిడర్ గా నియమించినట్లు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
'గల్ఫ్' చిత్రానికి విదేశాలలో 20 మంది ఓవర్సీస్ అంబాసిడర్లను, తెలుగు రాష్ట్రాలలో 10 మంది అంబాసిడర్స్ ని నియమించామని జూన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
తనను 'గల్ఫ్' చిత్రానికి అంబాసిడర్ గానియమించడం పట్ల బొండల గంగాప్రసాద్ స్పందిస్తూ గల్ఫ్ వలస కార్మికుల సమస్యల మీద వారి జీవితాల మీద ఇలాంటి ఒక చిత్రం రావడం అభినందనీయమని, గల్ఫ్ సమస్యల పట్ల అవగాహన కల్పించనున్న ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తమ శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు.
ఈ చిత్రంలో : చేతన్, సంతోష్, అనిల్, డింపుల్, పూజిత, పోసాని కృష్ణమురళి, నాగినీడు, తనికెళ్ళ భరణి, నల్ల వేణు, సూర్య, ప్రభాస్ శ్రీను, జీవా, బిత్తిరి సత్తి, సన, తీర్ద, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా : శివరాం, మాటలు : పులగం చిన్నారాయణ, నిర్మాతలు : యక్కలి రవీంద్ర బాబు, యo.యస్. రామ్ కుమార్, దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







