చికెన్ టిక్కీలు
- May 11, 2017
కావలసిన పదార్థాలు: (దంచిన) చికెన్ - అరకేజీ, శనగపప్పు - అరకప్పు, నీరు - 1 కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లి తరుగు - అరకప్పు, అల్లం తరుగు - 1 టీ స్పూను, జీరా, యాలకుల పొడి - అర టీ స్పూను చొప్పున, దనియాపొడి - 1 టీ స్పూను, చిదిమిన లవంగాలు - 2, గరం మసాల - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, నూనె - 2 టేబుల్ స్పూన్లు, గిలకొట్టిన గుడ్లు - 2.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో చికెన్, శనగపప్పు, నీరు, చిటికెడు ఉప్పు వేసి పప్పు మెత్తబడేవరకు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మిగతా మసాల పొడులతో పాటు మరికొద్ది ఉప్పు వేసి రుబ్బి చికెన్ మిశ్రమలో కలపాలి. ఈ ముద్దని అరంగుళం మందంతో, వడల్లా వత్తుకుని ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి. తర్వాత గుడ్డుసొనలో ముంచి నూనె రాసిన పెనంపై రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. పెరుగు చట్నీ మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







