స్పైసీజెట్ లో రూ.12కే విమాన టికెట్
- May 23, 2017
బడ్జెట్ క్యారియర్‌గా పేరుతెచ్చుకున్న స్పైస్ జెట్ విమాన ప్రయాణికులకు పండగలాంటి ఆఫర్ ప్రకటించింది. రూ.12కే ప్రారంభ ధరతో టికెట్లు ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. పన్నులు, ఇతర సర్‌చార్జిలను మినహాయించి ఈ ఆఫర్ అమలు చేయనున్నట్టు తెలిపింది. స్పైస్‌జెట్ 12వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని దేశీయ విమానాలతో పాటు విదేశీ సర్వీసులకు ఈ ఆఫర్ అమలు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఈ ఆఫర్ కింద 2017 మే 23 నుంచి 28 వరకు టికెట్లు విక్రయించనున్నారు. ఈ బుకింగ్స్ ద్వారా వచ్చేనెల 26 నుంచి 2018 మార్చి 24 వరకు ప్రయాణించవచ్చు. ''ప్రతి భారతీయుడికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలన్న స్పైస్‌జెట్ ప్రయత్నాన్ని ఈ ఆఫర్ల ద్వారా పునుద్ఘాటిస్తున్నాం...'' అని స్పైస్ జెట్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అంతేకాదు.. వార్షికోత్సవ ఆఫర్ కింద టికెట్లు బుక్‌చేసుకునే కస్టమర్లు లక్కీ డ్రా కాంటెస్ట్‌లో కూడా అర్హత పొందుతారని కంపెనీ తెలిపింది. ఈ కాంటెస్ట్‌లో లక్కీ ప్రైజ్ గెలుచుకున్న వారికి అంతర్జాతీయ విమాన టికెట్లతో పాటు, దేశీయ విమాన టికెట్లు, రూ.10 వేల విలువైన హోటల్ ఓచర్లు ఇవ్వనున్నట్టు స్సైస్‌జెట్ వెల్లడించిం
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







