విడుదల చేయనున్న చందమామ రావే
- May 24, 2017
'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై యూత్ హర్ట్‌ని దోచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రం "చందమామ రావే". ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్గా నటిస్తుంది. 'అది రాదు.. వీడు మారడు' అనేది క్యాప్షన్. ఈ చిత్రాన్ని లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రోడక్షన్ నెం-1 గా నిర్మాతలు కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రక్తచరిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వర్మ సహా పలువురు స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కవల దర్శకులు ధర్మ-రక్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ... "ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన దర్శకులు ధర్మ, రక్షలు సినిమాను చక్కగా రూపొందించారు. ప్రపంచంలో ట్విన్స్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా కూడా మా చిత్రమే కావడం విశేషం. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పెక్యులర్ లవ్‌స్టోరీ. లవ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవసరమని చెప్పేఎక్స్‌ట్రీమ్ లవ్‌స్టోరీ 'చందమామ రావే' డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌ను ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో రూపొందించిన పెక్యులర్ లవ్ స్టోరీ చందమామ రావే. నవీన్‌చంద్ర పాత్ర చాలా ఆసక్తికరంగా, యూనిక్‌గా ఉంటుంది. మంచి ఎమోషన్స్‌తో సాగే చిత్రం. హీరో నవీన్‌చంద్ర పూర్తి సహకారాన్ని అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా హిమాలయాలు, గ్యాంగ్‌టక్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. దేవదాసుని పార్వతి ఒక్కసారి వదిలేస్తేనే ఆయన పరిస్థితి అలా తయారైతే.. ఒకే అమ్మాయి హీరోని మూడు సార్లు వదిలేస్తే ఇంకెలా ఉంటుందనేది సినిమా బేసిక్ కాన్సెప్ట్. ఆద్యంతం అలరించే చిత్రంగా రూపొందిన "చందమామ రావే"ను జూన్ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







