అలనాటి బాలీవుడ్ నటికి ఆసుపత్రిలో కష్టాలు
- May 29, 2017
పాకీజా చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ గీతా కపూర్ వృద్ధాప్య కష్టాలను ఎదుర్కొంటోంది. అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో ఉన్న ఆమెను, కొడుకు నిర్ధాక్షణీయంగా వదిలేసి వెళ్లిపోయాడు. ముంబైలోని గోరెగావ్‌లోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రిలో బిల్లు కట్టేందుకు ఏటీఎంనుంచి డబ్బులు తీసుకువస్తానని వెళ్లి తిరిగి రాలేదు. ఆమె పలు బాలివుడ్ చిత్రాల్లో నటించిందని తెలియడంతో ఆమెను గురించిన కథనాలు మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. అతని చర్యలను తప్పుబట్టడంతో అతను నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తరువాత ఆసుపత్రిలో చేర్చి పరారయ్యాడు అని ఆమె తెలిపింది. ఆసుపత్రి ఫీజు లక్షరూపాయలు చెల్లించి గీతాకపూర్‌ను ఇంటికి తీసుకువెళ్లమని సిబ్బంది కొడుకు రాజాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. గీతాకపూర్ కూతురు కూడా అమ్మ విషయంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. వీరిపై చబ్బబద్దమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







