483 నిషేధింపబడిన మాత్రలను అక్రమ రవాణా... చైనా కెమిస్ట్ కు జైలు శిక్ష
- May 30, 2017
దుబాయ్: ' కొబ్బరి చెట్టు ఎందుకెక్కావని...పట్టుబడిన ఓ దొంగను ఊరోళ్లు నిలబెట్టి ప్రశ్నించారట , ఆ దొంగ ఏమాత్రం తడుముకోకుండా దూడకు గడ్డి కోసమని ఠకీమని చెప్పాడట...ఓహో అలాగా అని అతడ్ని వదిలిపెట్టారంట " దాదాపు అదే రీతిలో ఓ చైనా మహిళా కెమిస్టు మాదక ద్రవ్యాలతో పట్టుబడింది..తనిఖీ అధికారులు ఇదేమి పాడు పనమ్మా అని ప్రశ్నిస్తే...ఏ మాత్రం తడుముకోకుండా పరిశోధన కోసం పట్టుకెళుతున్నానని జవాబిచ్చింది. కానీ దుబాయ్ పోలీసులు ఊరోళ్ళ మాదిరిగా వదలలేదు...దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో జరిగిన ఈ ఘటనలో ఆమె సామానులో483 ప్రీగాబాలిన్ మాత్రలు కలిగి ఉన్న నేరానికి ఆ చైనా కెమిస్ట్ కు ఏడు సంవత్సరాలు జైలుశిక్ష, అనంతరం దేశ బహిష్కరణ విధించారు. ఆదివారం దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాప్ కోర్టు 37 ఏళ్ల చైనీస్ రసాయన శాస్త్రవేత్త 50,000 ధిర్హాం ల జరిమానా సైతం విధించింది. అక్రమ రవాణాకు తానేమీ పాల్పడటంలేదని కేవలం వాటిని శాస్త్రీయ పరిశోధన ,అభివృద్ధి ప్రయోజనాల కోసం మాత్రమే తీసుకువెళతున్నట్లు తుదివరకు వాదించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







