భవిష్యత్తు
- April 25, 2015
భవిష్యత్తు బంగారు బాట కావాలని
బాల్యమందే బాడుగ బండిలో
బడికి పోయి బాగుగా చదివి
బ్రతుకు బరువు కాకూడదని
భావించి, బలపము నుండి
బి.ఏ వరకు బహుముఖ ప్రజ్ఞతో
బహుమతులెన్నో గెలిచి,
'భలే' అనిపించుకున్నాను!
బాధ్యతాయుతంగా ఉద్యోగం చేసి
భరత మాతకు బహుళ కీర్తి కిరీటం
బహూకరించాలని బంగారు కలలెన్నో కన్నాను!
బాహ్యప్రపంచంలో భజన చేస్తే తప్ప
"భోజనం" దొరకదని భూజనుల వల్ల బోధపడింది!
"బోధి"వృక్షం నా కళ్ళెదురుగా నిలబడింది!
"భోరు"మని ఏడ్వలేక,
బాబోయని అరవ లేక,
భగవంతుని వైపు చూసి,
"భాగ్య రేఖ" నాకెందుకు గీయ లేదని,
భయపడుతూ అడిగాను!
"బాటసారి" ఐయామ్ సారి
బ్రతక నేర్చిన వాళ్ళదే బ్రతుకు
బండ చాకిరికి బంగారానికి
బారెడు దూరం మరి
బాగా ఆలోచించుకో ఒకసారి
"భగవద్గీత" బరువంతా ఇంతే
భరించు బాటసారి అన్నాడు భగవంతుడు!!
--- డా|| కోడి రామ, అలైన్, యు ఏ యి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







