మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మంత్రి కేటీఆర్ ట్వీట్
- June 03, 2017
తెలంగాణ భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకులు శనివారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావుకు కేటీఆర్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్‌రావు సమర్థవంతుడైన నాయకుడని కొనియాడారు.
‘స్పష్టమైన భావప్రకటన, కష్టపడేతత్వం, సమర్థత కలిగిన కొంతమంది నాయకుల్లో ఒకరైన హారీశ్‌రావు గారికి జన్మదిన శుభాకాంక్షల’ని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ట్విటర్ ద్వారా హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపింది.
మరోవైపు హరీశ్‌రావు తన నియోజకవర్గం సిద్ధిపేటలో కలియ తిరిగారు. ఇంటింటికీ వెళ్లి అభిమానులను అప్యాయంగా పలకరించారు. బాలింతలకు కేటీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







