ఐర్లాండ్ పీఎం రేసులో ప్రవాస భారతీయుడు డాక్టర్ లియో వారాద్కర్
- June 03, 2017
ఐర్లాండ్‌లో ఒక ప్రవాస భారతీయుడు ఆ దేశ అత్యున్నత పదవిని అందుకోనున్నాడు. ముంబై వైద్యుడి కుమారుడు ఐర్లాండ్ ప్రధాని కాబోతున్నాడు. ఎన్నికల్లో ప్రత్యర్థిపై ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న డాక్టర్ లియో వారాద్కర్ అనే ఎన్ఆర్ఐ.. ఇవాళ విడుదలయ్యే తుది ఫలితాలతో ప్రధాని పదవిని అలంకరించబోతున్నాడు.
ముంబయికి చెందిన ఓ వైద్యుడి కుమారుడు ఐర్లాండ్ ప్రధాని అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా డాక్టర్ లియో వారాద్కర్ ఎన్నిక కావడం దాదాపు ఖాయమైంది. ప్రత్యర్థిపై 60 శాతం ఓట్లతో గెలిచిన వారాద్కర్ ఎండా కెన్నీ తర్వాత ఆ దేశానికి ప్రధాని కాబోతున్నారు. ఐర్లాండ్‌లో అధికారంలో ఉన్న ఫైన్ గేయల్ పార్టీ తరఫున ప్రధాని అయిన అతి చిన్న వయస్కుడు కాబోతున్నాడు.
ఎన్నికల తుది ఫలితాలలో 38ఏళ్ల ప్రవాస భారతీయుడు, ఐర్లాండ్ మంత్రి లియో వారాద్కర్ స్పష్టమైన ఆధిక్యం సంపాదించారు. తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించిన తొలి మంత్రి లియో వారాద్కర్. స్వలింగ సంపర్కుల వివాహం, గర్భస్రావం లాంటి క్లిష్టమైన యూరోపియన్ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాడు.
ముంబయికి వైద్యుడు అశోక్ వారాద్కర్, ఐరిష్ నర్స్ మరియంల చిన్నకుమారుడైన లియో వారాద్కర్. డాక్టర్‌గా ఉంటూనే 2007లో ఐర్లాండ్ రాజకీయాల్లో వచ్చారు. 2015లో తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆరేళ్లపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన కెన్నీ పదవి నుంచి దిగిపోవడంతో ఆ పదవి కోసం పోటీపడిన మరో మంత్రి సిమోన్ కోనెవెయ్పై లియో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచారు. ఐర్లాండ్ ప్రధాని కాబోతున్నాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







