జూన్ 12న విడుదల కానున్న'గౌతమ్ నంద' టీజర్ !!
- June 05, 2017
మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను చిత్ర కథానాయకుడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న విడుదల చేయనున్నారు.
చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. "గౌతమ్ నంద"లో హీరో గోపీచంద్ పాత్రను దర్శకుడు సంపత్ నంది చాలా స్టైలిష్ గా.. అంతే పవర్ ఫుల్ గా తెరకెక్కించాడు. సంపత్ నంది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సిద్ధం చేసిన కథ-కథనాలే ఈ చిత్రానికి బలం. జూన్ 12న మా హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకొని "గౌతమ్ నంద" టీజర్ ను విడుదల చేయనున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాకీ పార్ట్ పూర్తయ్యింది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా "గౌతమ్ నంద" నిలుస్తుంది. రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయిన త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం" అన్నారు.
గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







