హీరో బాలయ్య దమ్ము చూసి 'ఓరి నాయనో' అనేసిన శ్రియ
- June 06, 2017
బాలకృష్ణ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పేరును వెల్లడిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా పూరి జగన్నాథ్ మీడియాకు తెలుపుతూ... లిస్బన్లో నిన్న ఓ ఛేజింగ్ సీన్‌ను చిత్రీకరించామని, ఈ సీన్లో కారుని డ్రిఫ్టింగ్ పద్ధతిలో 360 డిగ్రీలు తిప్పే షాట్‌ను రూపొందించామని చెప్పాడు.
ఇందులో రిస్కీ షాట్‌ను బాలకృష్ణ రెండు సార్లు డూప్ లేకుండా అద్భుతంగా చేశారని ప్రశంసించారు. ఈ షాట్లో బాలకృష్ణ అద్భుతంగా ప్రతిభ కనబరుస్తోంటే ఆయన పక్కనే ఉన్న శ్రియ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని అన్నారు.
బాలకృష్ణకు సినిమాపై ఉన్న పాషన్‌తోనే ఇలా రిస్కీ షాట్లో పాల్గొన్నారని పూరి చెప్పారు. పోర్చుగల్ టెక్నీషియన్లు, చిత్రయూనిట్ అంతా ఆయనను చప్పట్లతో అభినందించారని అన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







