తెలంగాణా రాష్ట్రంలో మూడో విడత హరిత హారం
- June 06, 2017
తెలంగాణాలో మూడో విడత హరిత హారానికి రంగం సిద్ధమవుతోంది. ఈసారి 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ పరిధిలో 2 కోట్ల 10 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఈసారి పెద్ద ఎత్తున పండ్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఉసిరి, నేరేడు, మేడి, పనస,జామ మొక్కలతో పాటు తాటి, ఈత, టేకు చెట్లను పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల మేర మూడో విడత హరితహారం చేపట్టనున్నారు. అలాగే సీడ్ బాంబింగ్ పేరిట మట్టి, విత్తనాలు కలిపి తయారు చేసిన విత్తన బంతులను గుట్టల్లో చల్లనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







