మహిళా దుస్తులలో మానభంగం ఆపై ...హత్య
- June 07, 2017
11 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని అబూదబీ పోలీసులు 48 గంటలలోపు గుర్తించారు. యూఏఈలోని అబూదబీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుపై అబుదాబి పోలీస్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తూ అల్ షరీఫీ మాట్లాడుతూ, అబూదబీకి వలస వచ్చిన ఓ పాకిస్తాన్ యువకుడు.. తాను ఉండే ఇంటికి దగ్గరలోని ఓ పాకిస్తాన్ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ఆ ఇంట్లోని ఓ బాలుడిపై కన్నేశాడు.అనుమతి లేకుండా బాలుడి తల్లిదండ్రులు అపరిచిత వ్యక్తితో వెళ్ళనివ్వని తెలుసుకొని ఎవరూ లేని సమయంలో అమ్మాయిలా దుస్తులు మార్చుకుని ఇంట్లోకి దూరి ఆ 11 ఏళ్ల బాలుడిని బయటకు తీసుకెళ్లాడని పోలీసులు చెప్పారు. తొలుత ఆ దుర్మార్గుడు బాలుడిని తాడుతో కట్టిపారేశాడు. ఆ తర్వాత తాను ఉండే భవనం పైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయం బయటపడుతుందని భావించిన నిందితుడు బాలుడి గొంతు పిసికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఓ మూటలో బాలుడి శవాన్ని ఉంచి రాత్రి సమయంలో నగర శివార్లలో పడేశాడు. బాలుడి శవాన్ని గుర్తించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అబుదాబి పోలీస్ ఫోరెన్సిక్ లాబొరేటరీ నివేదికలో బాలుడి హత్యకు అనుమానితుడికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలను కనుగొంది. బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నించి ఆ ఇంటికి వచ్చి పోయే వాళ్ల వివరాలు సేకరించారు. పాకిస్తానీ యువకుడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ హత్యకు సంబంధించిన పలు వివరాలు బయటికొచ్చాయి. ఆ కానందునిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై మరింత చట్టపరమైన విధానాల అమలు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఈ కేసును అప్పగించినట్లు ఆయన చెప్పారు. నిందితుడికి జైలు శిక్ష విధించిన తర్వాత.. దేశ బహిష్కరణ చేస్తామని పోలీసులు వెల్లడించారు. మేజర్ జనరల్ అల్ షరీఫీ వారి వృత్తిపరమైన పరిశోధన కోసం దర్యాప్తు నేర పరిశోధన బృందాన్ని అభినందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







