బాలయ్య 'పైసా వసూల్' ఫస్ట్ లుక్
- June 09, 2017
బాలకృష్ణ పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి ఎవరూ ఊహించని టైటిల్ పెట్టి బాలయ్య అభిమానుల మైండ్ బ్లాంక్ చేసాడు పూరిజగన్నాథ్. రేపు జరగబోతున్న బాలకృష్ణ 57వ జన్మ దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈమూవీ టైటిల్ ప్రకటించడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసి పూరీ తన స్పెషాలిటీని ఈ విషయంలో కూడ చాటుకున్నాడు.
బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈసినిమాకు 'పైసా వసూల్' అన్న టైటిల్ ఫిక్స్ చేసి ఈమూవీ కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేయబోతోంది అన్న సంకేతాలు ఇచ్చాడు పూరి. 'తేడా సింగ్' 'గ్యాంగ్ స్టర్' 'ఉస్తాద్' అన్న టైటిల్స్ ఈసినిమాకు ప్రచారంలో వచ్చినా ఎవరి ఊహకు అందని ఈ 'పైసా వసూల్' టైటిల్ బాలకృష్ణ అభిమానులనే ఆశ్చర్య పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం పోర్చుగల్ లో ఉన్న బాలకృష్ణ తన జన్మదిన వేడుకలను రేపు శనివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఫేస్ బుక్లో లైవ్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం జాతీయస్థాయిలో సోషల్ మీడియా ఆధారంగా కార్యక్రమాలను నిర్వహించే సంస్థను రంగంలోకి దించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో బాలకృష్ణ లుక్ డిఫరెంట్ అని అందరూ అనుకుంటూ ఉంటే బాలయ్య మూవీ టైటిల్ కూడ డిఫరెంట్ గా మారింది.
సెప్టెంబర్ లో దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ మహేష్ 'స్పైడర్' తో పోటీ పడబోతోంది. దీనితో రాబోతున్న దసరాకు మహేష్ బాలయ్యల మధ్య వార్ ఖరార్ అయిపోయింది. అయితే ఒక సామాన్యమైన టైటిల్ ను బాలకృష్ణ లాంటి టాప్ హీరో సినిమాకు టైటిల్ గా పెట్టడం వెనుక పూరిజగన్నాథ్ వ్యూహం ఏమిటో బాలకృష్ణ అభిమానులకు కూడ అర్థంకాని విషయంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







