సామాజిక మీడియా ఆర్ ఓ పి కు సమర్థవంతమైన సాధనం.
- June 13, 2017
సమస్యలు సృష్టించడం ..వివాదాలు పరిష్కరించడంలో సామాజిక మాధ్యమాలు ఇటీవల ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, రాయల్ ఒమాన్ పోలీస్ సైతం సోషల్ మీడియాను పరిశోధనాత్మక సాధనంగా ఉపయోగిస్తున్నారు. గత ఆదివారం మస్కట్ లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో తన కారుని నిర్లక్ష్యంగా వేగంగా నడిపిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియాలో ప్రసారం కాబడిన ఒక వీడియో ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ ధృవీకరించింది. " ఆ డ్రైవర్ కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ చెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ఆధారంగా చర్య తీసుకున్న తీరు ఇదే మొదటిసారి కాదు. గత నెలలోను , మరొక కారు డ్రైవర్ వరదలు ప్రవహిస్తున్న రహదారి పై కారుని నడుపుతూ సైకిలు తొక్కుతున్న వ్యక్తిపై నీళ్లు చిమ్ముకొంటు వెళ్లిన కారణంగా అరెస్టు చేశారు. పౌరులు అనేకమంది పోస్ట్ కాబడిన ఆ వీడియో పట్ల గట్టిగా ప్రతిస్పందించారు. ఒమాని సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన ఈ నిర్లక్ష్యంపై స్పందించిన పోలీసులు కారు డ్రైవర్ పై చర్య తీసుకున్నారు. వాహన డ్రైవర్ తన కారుని వేగవంతంగా నడుపుతున్నప్పుడు ఆ సైక్లిస్ట్ సమీపంలోనే ఉన్నాడని వీడియో పేర్కొంది."ఇటువంటి చెడు ప్రవర్తనలను బహిర్గతం చేసిన సోషల్ మీడియా పోస్టుల పట్ల అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. చర్యను తీసుకోవడం పట్ల రాయల్ ఒమాన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని సలీమ్ ఖలాఫ్ అనేఆసక్తిగల సోషల్ మీడియా వినియోగదారుడు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







