రెండో ప్రపంచ యద్ధం ఫైటర్ జెట్ ఫ్లైట్ కుప్పకూలింది
- June 13, 2017
అది రెండో ప్రపంచ యద్ధం నాటి పాత ఫైటర్ జెట్. ఫ్రాన్స్ లో జరిగే ఓ ఎయిర్ షో కు వచ్చింది. విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రేక్షకులంతా కళ్లు పెద్దవి చేసుకొని ఉత్కంఠతో చూస్తున్నారు. అంతలోనే ఊహించని ప్రమాదం. టేకాఫ్ సమయంలో అనుకోని ఘటన. యుద్ధ విమానం అదుపు తప్పింది. పల్టీలు కొట్టింది. పైకి ఎగరాల్సిన ఫ్లైట్.. కిందకు వాలిపోయింది. రెక్కలు నేలకు తగిలి ముక్కలయ్యాయి.
ఊహించని ఈ ప్రమాదానికి ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రెక్కలు విరిగిన విమానం ఎక్కడ తమ వైపు దూసుకొస్తుందోనని హడలిపోయారు. అయితే.. ప్రమాదం జరిగిన చోటే విమానం కూలిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత తేరుకొని.. యుద్ధ విన్యాసాలు చూడటానికి వచ్చిన ప్రేక్షకులంతా కలిసి ఆ ఫ్లైట్ ను పక్కకు జరిపారు.
తాజా వార్తలు
- కువైట్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







