భాగ్యనగరం లో భారీ వర్షం
- June 15, 2017
హైదరాబాద్: నిన్న మొన్నటిదాకా ఎండలకు తాళలేకపోయిన నగర జనం.. ప్రస్తుతం చల్లటి వాతావరణంలో సేదతీరుతున్నారు. గురువారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కీసర, నాగారం, కాప్రా, చర్లపల్లిలలో భారీ వర్షం పడింది.
భారీ వర్షానికి రోడ్ల పైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎక్కడిక్కకడ ట్రాఫిక్ జామై వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో నగరవ్యాప్తంగా సాయంత్రమే చీకటి పడిన వాతావారణాన్ని తలపిస్తోంది. వాహనదారులంతా లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈసారి అనుకున్న దానికన్నా నాలుగైదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని వాతావరణశాఖ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







