'అప్త' వారిచే మెగా బ్లడ్ డ్రైవ్-2017
- June 15, 2017
మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు సంఘీభావాన్ని తెలుపుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వర్జీనియా రాష్ట్రంలోని స్టెర్లింగ్ నగరం ఇనోవా హాస్పిటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు రక్తదానం చేశారు.
అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ AJ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి ప్రస్తావించి, బ్లడ్ బ్యాంక్ సేవలను కొనియాడారు. ఈ సమయంలో చిరంజీవి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం మరింత రెట్టింపయ్యిందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయ్ రేపల్లె గారు అమెరికాలోని ఆప్త సంస్థ ఆధ్వర్యంలో అక్కడున్న చిరంజీవి అభిమానుల సహాయంతో కుటుంబ కార్యక్రమంగా నిర్వహించడంతో అధిక శాతం మహిళలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







