సలాల పర్యాటక ఉత్సవం కోసం ధఫోర్ మున్సిపాలిటీ సిద్ధం
- June 23, 2017
సతాలా పర్యాటక ఉత్సవాల కు సంబంధించిన అన్ని సన్నాహాలు పూర్తి కాబడ్డాయి. జూన్ 30 వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు జరుగుతాయని ధఫోర్ మున్సిపాలిటీ ముఖ్యులు, సతాలా పర్యాటక నిర్వహణ కమిటీ అధిపతి తెలిపారు.ఈ పండుగకు సంబంధించి "ఒమన్ సమృద్ధి మరియు అభివృద్ధి " అనే (థీమ్) అంశం పై కొనసాగనుంది. ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలలో సాంప్రదాయ కళలు మరియు హస్తకళలకు పండుగలలో అధిక ప్రాధాన్యత ఉంది. విద్య మంత్రిత్వశాఖ సహకారంతో 35 దేశాలు ఈ కార్యక్రమాలలో పాల్గొనడాన్ని మనం చూడవచ్చు. ప్రధాన పండుగ ప్రాంతం, థియేటర్ విభాగం మరియు మరికొన్ని ప్రాంతాలు పునర్నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ నిత్యం వినోదం, కళ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహార దుకాణాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. కళా ప్రదర్శనలు మరియు పలు సెమినార్లు నిర్వహించనున్నారు.. ఈ ఉత్సవంలో క్రీడలకు సంబంధించిన పలు కార్యక్రమాలతో పాటు అలాగే ఖురాన్ లోని వచనాలను గుర్తు పెట్టుకొనే పోటీలు జరుగుతాయని శ్రీ శ్రీ షన్ఫారీ పేర్కొన్నారు. స్థానిక అధ్యాపకులు, విదేశాల్లో ఉన్నవారిని సైతం సలాల పర్యాటక ఉత్సవం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారని ఆయన చెప్పారు. అదనంగా, వివిధ ప్రదర్శనలు, స్థానిక మరియు జి.సి.సి ప్రదర్శనలు, తక్వా, మిర్బాట్ మరియు ఈనిన్లోని మునిసిపాలిటీ ఫ్రెండ్స్ శిబిరం యొక్క విలయాట్లలో కార్యకలాపాలు జరుగుతాయి. రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ధోఫర్ మున్సిపాలిటీ పలు ఏర్పాట్లు పూర్తిచేసిందని సమీప భవిష్యత్తులో సలాలాలో కొన్ని ముఖ్య రౌండ్ అబౌట్ల సమీపంలో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి అన్ని జాగ్రత్తలు మున్సిపాలిటీని తీసుకొంటున్నట్లు షాంఫారీ చెప్పారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







