మ్యాంగో జెల్లీ కాజూ సందేష్
- June 23, 2017
కావలసిన పదార్థాలు: జీడిపప్పు పేస్ట్- 1 కప్పు, పంచదార- 3 కప్పులు, నెయ్యి- 1 టీ స్పూను, మామిడి గుజ్జు- 1 కప్పు, నీళ్ళు- 1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్- 2 టేబుల్ స్పూన్లు .
తయారీ విధానం: ఒక బాణలిలో రెండు కప్పుల పంచదార, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ఉడికి గరిటెతోపాటూ వచ్చేస్తున్నట్టు ముద్దగా ఒక దగ్గరికి చేరుతున్నప్పుడు మంట కట్టేసి, ఒక పళ్ళానికి నెయ్యిరాసి మిశ్రమాన్ని అందులోకి తీసి సమంగా పరవాలి. తరువాత మరొక బాణలిలో ఒక కప్పు పంచదార, నీళ్ళు పోసి తీగపాకం వచ్చాక మామిడి గుజ్జు వేసి సన్నని మంటమీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడి జిగటగా అయ్యాక పళ్ళెంలోని జీడిపప్పు మిశ్రమంపై వేసి సమానంగా పరచి డైఫ్రూట్స్ వేసి, చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







