శాతకర్ణి తమిళ ఆడియో వేడుకకు హాజరు కానున్న బాలయ్య
- July 09, 2017
నగరంలోని తెలుగు ప్రజలు, తన అభిమానులు, టీడీపీ కార్యకర్తల కోసం నందమూరి బాలకృష్ణ చెన్నైకి వస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసిన శాతకర్ణి పాత్రలో చరిత్రాత్మకమైన కథలో ధీరోధాత్తమైన నటన ప్రదర్శించిన ఆయన 100వ చిత్రం 'గౌతమపుత్ర శాతకర్ణి' తమిళ వెర్షన్ ఆడియో వేడుక సోమవారం సాయంత్రం నగరంలో జరుగనుంది. స్థానిక చేపాక్‌లోని కలైవానర్ అరంగంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్ర నిర్మాత నరేంద్రతో కలిసి టీడీపీ చెన్నై విభాగం భారీ సన్నాహాలు చేపట్టింది. బాలకృష్ణతోపాటు చిత్ర దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియ, ఇతర ముఖ్య తారాగణం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెన్నైలో తెలుగు ప్రజల కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా ఈ వేడుకకు విచ్చేస్తున్నారని శనివారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర నిర్మాత నరేంద్ర, టీడీపీ గ్రేటర్ చెన్నై కన్వీనర్ చంద్రశేఖర్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో నిర్మాత జె.రామాంజనేయులు, టీడీపీ చెన్నై కార్యదర్శి రాజేష్, తెలుగు సేన కార్యదర్శి వెంకటేష్ కూడా పాల్గొన్నారు.
2013లో జరిగిన వందేళ్ల సినీ వేడుకల నిమిత్తం చివరిసారిగా బాలకృష్ణ చెన్నైకి వచ్చారు. మధ్యలో దిగ్గజ దర్శకులు బాపు మరణించినప్పుడు వచ్చినా బాధాకరమైన విషయం కావడంతో ఆయన అభిమానులు ఎవర్నీ కలుసు కోలేదు. ఇప్పుడు తన సినిమా కార్యక్రమంలోనే బాలకృష్ణ పాల్గొనబోతున్నారు. నాలుగేళ్ల తరువాత బాలయ్య చెన్నైకి వస్తుండడంతో... 'శాతకర్ణి' రాకకోసం అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం చెన్నైకి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం హోటల్‌లో విశ్రాంతి తీసుకుని, సాయంత్రం 6 గంటలకు 'గౌతమపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకకు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి తమిళ పరిశ్రమ నుండి సీనియర్ నటులు ప్రభు, కార్తీక్, జయంరవి, విశాల్, నిర్మాత కలైపులి ఎస్.థాను తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
తెలుగు పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' తమిళ ప్రేక్షకుల్ని కూడా అమితంగా ఆకట్టుకుంటుదని నిర్మాత నరేంద్ర ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబ్బింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులో సుమారు 300 థియేటర్లలో '..శాతకర్ణి'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నరేంద్ర చెప్పారు. తెలుగు ప్రజలు, సినీ అభిమానులు ఆడియో వేడుకకు హాజరుకావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 87544 64370, 81444 09900 నెంబర్లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









