జగిత్యాల లో ‘గల్ఫ్‘ సినిమా యూనిట్ పర్యటన
- July 09, 2017
గల్ఫ్ వలసల నేపధ్యంలో సామాజిక చిత్రాల దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. యస్. రామ్ కుమార్ నిర్మిస్తున్న “ గల్ఫ్ ‘’ చిత్రం దుబాయ్, కువైట్ దేశాలలో షూటింగ్ పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు సిద్దమైంది.
గల్ఫ్ వలసలపై అవగాహన కల్పించడానికి, చిత్ర ప్రమోషనల్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన గల్ఫ్ ప్రవాసి అవగాహన యాత్రలో భాగంగా జగిత్యాలలో ఈ నెల 9వ తేదినా జరిగిన అవగాహన సదస్సు విజయవంతం అయ్యిందని ప్రవాసి మిత్ర సంపాదకుడు మందా భీం రెడ్డి గారు తెలిపారు.
చేతన్ మద్దినేని కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం, గల్ఫ్ వలసల మీద పూర్తి స్థాయి అధ్యయనం చేపట్టిన తరువాత చాలా వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించామని, గల్ఫ్ లో నివసిస్తున్న దాదాపు 25 లక్షలమంది తెలుగువారి జీవన చిత్రాన్ని హృద్యంగాను, వినోదాత్మకంగాను తెరకెక్కించామని ‘’ సరిహద్దులు దాటిన ప్రేమకథ’’ అన్న క్యాప్షన్ తో వస్తున్న ఈ చిత్రంలో చక్కటి మెసేజ్ తో పాటు అందమైన ప్రేమకథ ఉంటుందని చిత్ర యూనిట్ తెలియజేసింది.
తెలంగాణ నుండి లక్షలాది మంది యువత గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళారని, వారి కుటుంబ సభ్యులకు ప్రేక్షక దేవుళ్ళకి ఇదొక చక్కటి ద్రుశ్యానుభూతిని కలిగిస్తుందని, తమ ‘’ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’’ , ‘’ క్రిమినల్ ప్రేమకథ ‘’ కంటే గొప్ప కమర్షియల్ సక్సస్ ని , ‘’ సొంతఊరు ‘’,’’ గంగపుత్రులకు ‘’ మించి ప్రశంశలు అందుకుంటుందన్న ఆశాభావాన్ని యూనిట్ వ్యక్తం చేసింది.
హీరో “ నాని “ గారి చేతుల మీదుగా విడుదలైన “ హీరో ఫస్ట్ లుక్ “ కి చాలా మంచి స్పందన వచ్చిందని, ఈ అవగాహన యాత్రతో యావత్ ప్రేక్షకులకు ఈ చిత్రం మరింత దగ్గర అవుతుందని ఈ కార్యక్రమంలో గల్ఫ్ చిత్ర అంబాసిడర్ తంగెళ్ళ రమేష్ గారు, గల్ఫ్ మూవీ ఓవర్సిస్ అంబాసిడర్ గుండేటి రమేష్ గారు, ఓమాన్ యాన్. అర్. ఐ. నరేంద్ర పన్నీరు గారు అయన మాతృ మూర్తి రామక్క గారు, హన్సిక మాన్ పవర్ చిట్ల రమణ గారు మరి కొందరు ప్రముఖులు ఈ పోగ్రామ్ లో పాల్గొన్నారని ప్రకటనలో తెలిపారు.
చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిలి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్, శివ తదితరులు తారాగణం.
కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్ కుమార్ కుర్రా, రాజా.జి, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్. యస్. రామ్ కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి.


తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









