మొదలైన 'కాలా' రెండో షెడ్యూల్
- July 16, 2017
రంజిత్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం 'కాలా'. హ్యూమా ఖురేషి కథానాయిక. సముద్రకని కీలకపాత్ర పోషిస్తున్నారు. ముంబయికి చెందిన ఓ తమిళ డాన్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముంబయిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. కొన్ని కారణాలతో చిత్రీకరణ ఆపేశారు. ఇప్పుడు చెన్నైలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇందుకోసం చెన్నై శివారులోని ఈవీపీ పార్కులో ముంబయిలోని తారావి ప్రాంతం సెట్‌ను భారీ బడ్జెట్ తో ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి చిత్రీకరణ ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితమే అమెరికా నుంచి చెన్నై వచ్చిన రజనీకాంత్ 'కాలా' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దాదాపు 60 రోజుల పాటు నిరాటంకంగా చిత్రీకరణ ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్‌తో రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తవుతాయని సమాచారం. ఆ తర్వాత కస్తూరిరావ్, సముద్రకని, అరుల్దాస్లకు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కిస్తారు. తర్వాత మళ్లీ ముంబయిలో చిత్రీకరణ ఉంటుందని సమాచారం. చెన్నైలో జరుగుతున్న చిత్రీకరణలో హ్యూమా ఖురేషి, నానాపటేకర్, అంజలిలు కూడా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







