రజని కాంత్ పుట్టిన తేదీ 12-12-1950 టైటిల్ తో సినిమా
- July 16, 2017
జ్యో స్టార్ ఎంట్రప్రెస్స్ పతాకం పై కబాలి సెల్వ దర్శకత్వం లో ఎం కోటేశ్వర రాజు నిర్మిస్తున్న చిత్రం 12-12-1950. సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయిన డైరెక్టర్ సెల్వ ఆయన పుట్టిన రోజు తారీఖు 12-12-1950 ను తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు. ఈ చిత్రం నలుగురు రజినీకాంత్ వీరాభిమానులు కథ. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ . రమేష్ తిలక్, తంబీ రామయ్య , యోగి బాబు , ఎం ఎస్ భాస్కర్, జాన్ విజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ సెల్వ ఈ చిత్రం రజినీకాంత్ గారి కబాలి క్యారెక్టర్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సెల్వ మాట్లాడుతూ "నేను రజినీకాంత్ వీరాభిమానిని, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగా రోజు. మేము అయన పుటిన రోజుని ప్రతిరోజు జరుపుకుంటాం . ఈ చిత్రం లోని హీరో రజినీకాంత్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో సినిమా చూస్తాడు అన్నది ముఖ్య కథ. ఈ చిత్రం షూటింగ్ పూర్తీ అయింది. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ లాంచ్ చేసాము. మా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో టీజర్ రిలీజ్ చేయబోతున్నాము. కామెడీ తో పాటు సినిమా చాల ఎమోషనల్ గ ఉంటుంది. ఆదిత్య - సూరియన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 72 శాతం కామెడీ 28 శాతం జి ఎస్ టి (గ్యాంగస్టర్, సెంటిమెంట్ మరియు థ్రిల్లర్ )".
నటీనటులు : కబాలి సెల్వ, తంబీ రామయ్య , షఫీ, రమేష్ తిలక్, ఆధవం, అజయ్ ప్రశాంత్, యోగి బాబు, ఎం ఎస్ భాస్కర్, ఢిల్లీ గణేష్, జాన్ విజయ్ .. డైరెక్టర్ : కబాలి సెల్వ , మ్యూజిక్ : ఆదిత్య సూర్య , ప్రొడ్యూసర్ : ఎం కోటేశ్వర రావు , కెమెరా : విష్ణు శ్రీ , ఎడిటింగ్ : దినేష్ పోంరాజ్, ఆర్ట్ : ఏ రాజేష్ , స్టంట్ : దినేష్ కసి, లిరిక్స్ : మతమిల్ , కొరియోగ్రాఫర్ : అజర్ ,
బ్యానర్ : జ్యో స్టార్ ఎంట్రప్రెస్స్.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







