తెలుగు ఫిలిం పబ్లిసిటి డిజైనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- July 18, 2017
24క్రాఫ్ట్ విభాగాలలో ఒకటైన పబ్లిసిటీ డిజైనింగ్ యూనియన్ ఎలక్షన్లు తేది 15-07-2017 శనివారం ఉదయం 11 గం||లకు ఎ.పి. సినీ ఫెడరేషన్ సెక్రటరి దొరై గారి ఆధ్వర్యంలో పబ్లిసిటీ డిజైనర్ల సమక్షంలో జరిగింది. ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్‌గా చిక్కవరపు రాంబాబును, జనరల్ సెక్రటరీగా విక్రమ్ రమేష్‌ను, ట్రెజరర్‌గా ఈశ్వర్ అందే ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సి.హ్‌చ్. రాంబాబు మాట్లాడుతూ.. మాపై వుంచిన నమ్మకాన్ని మేము తప్పనిసరిగా నిలబెడతామని.. ప్రతిఒక్కరికి ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామని, అలాగే కార్డు లేనివారు వెంటనే కార్డు తీసుకోవాలని.. దీనివలన హెల్త్ ఇన్సురెన్స్ మరియు వాళ్ళ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు వంటి లాభాలెన్నో వున్నాయని.. తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే ఫెడరేషన్ తరపున
మేము తీసుకును చర్యలకు వాళ్ళు బాధ్యులగుదురని తెలిపారు. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన సురేష్ బుజ్జి గారికి, యూనియన్ సభ్యులకు థ్యాంక్స్ చెప్పారు. జనరల్ సెక్రటరి విక్రమ్ రమేష్ మాట్లాడుతూ.. యూనియన్ మాకు ఇది హోదాలా కాకుండా, ఇది ఒక బాధ్యతగా తీసుకున్నామని... మా పైన వున్న నమ్మకంతో మాకీ అవకాశం కల్పించిన సురేష్‌జిజ గారికి, మరియు మా యూనియన్ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అని చెప్పారు. ట్రెజరర్ ఈశ్వర్ అందే మాట్లాడుతూ.. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన యూనియన్ సభ్యులకు థ్యాంక్స్, ఇంకా నాన్‌మెంబర్స్ వెంటనే కార్డ్ తీసుకోవాలని.. లేకపోతే, వాళ్ళు మున్ముందు ఎన్నో ప్రయోజనాలు కోల్పోతారని, ఇంకా ఎటువంటి సమస్య వున్నా మేము ముందుండి పోరాడతామని చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







