వాట్సాప్‌లో యూట్యూబ్ వీడియోలు!
- July 18, 2017
అత్యధికులు వినియోగిస్తున్నచాటింగ్ అప్లికేషన్ వాట్సాప్‌కు మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇక యూట్యూబ్ వీడియోలను ఈ యాప్‌లోనూ నేరుగా చూసేలా అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత ఈ సదుపాయాన్ని కేవలం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబోతున్నారు. ఇక మరోవైపు కొత్త 2.17.40 వెర్షన్లో వాట్సాప్‌లో వచ్చే వీడియోను ఐఓఎస్ వినియోగదారులు మరింత పెద్దదిగా చేసి చూడొచ్చు. ఈ సౌలభ్యం ఐఫోన్ 7, 7ప్లస్, 6 ఎస్, ఎస్ ప్లస్ మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్స్ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
ఇక త్వరలో వాట్సాప్ వినియోగదారులు ఎలాంటి డాక్యుమెంట్లనైనా ఇతరులకు పంపుకునే సౌలభ్యాన్ని అందుకోబోతున్నారు. మరోవైపు ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పంపే ఫొటోలు కంప్రెస్ అయ్యి మరొకరి చేరతాయి. దీంతో అవి కొంత నాణ్యతను కోల్పోయేవి. తాజా అప్డేట్లో ఒరిజినల్ ఫొటోలను యథాతథంగా మరొకరికి చేరేలా వాట్సాప్ మార్పులు చేసింది.
ఇక టెక్ట్స్‌కు బోల్డ్, ఇటాలిక్ వంటి అదనపు హంగులను జోడించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్లన్నీ బేటా వెర్షన్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న దానిపై స్పష్టత లేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







