'మళ్ళీ రావా' అంటూ వచ్చేస్తున్న సుమంత్
- July 18, 2017
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తైనట్లు నిర్మాత తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'మేము కొత్తవాళ్లమైనా కథ మీద నమ్మకంతో సుమంత్ మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 30 రోజుల్లో ఒకేఒక్క షెడ్యూల్‌లో ఈ సినిమా పూర్తి చేయగలిగాం. పది నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం వల్లే ఈ సినిమాను 30 రోజుల్లో తీయడం సాధ్యపడింది. ఆగస్టు మొదటి వారంలో లోగో, టీజర్‌ను విడుదల చేయనున్నాం' అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







