క్లిష్టమైన పరిస్థితిలో నావికుని భార్య
- August 04, 2017
నౌకలో సముద్రాలు చుట్టే ఆ నావికునికి కష్టాల కడలి జీవితంపై దిగులు కల్గిస్తుంది. అనారోగ్యం పాలైన తన భార్యను చూసేందుకు తన మాతృ దేశం వెళ్లేందుకు దీనంగా ఆ ప్రవాసీయుడు ఎదురుచూస్తున్నాడు. శ్రీలంకకు చెందిన సెయిలర్ శాంతా రాజపక్సే(55) మనోవ్యధ అతడి మాటల్లోనే చెప్పాలంటే "మూడు నెలలుగా నా ఇద్దరు పిల్లలు స్కూల్ కు వెళ్లడం లేదు. నా భార్య తన సోదరుల దగ్గర అప్పు చేసింది. దాన్ని ఎలా తీర్చాలో తెలియక దిగులుతో గుండెపోటు తెచ్చుకుంది. ఆ సమాచారం సైతం నా స్నేహితుల ద్వారానే నాకు తెలిసింది. వారితో మాట్లాడే అవకాశం కూడా నాకు లేకుండాపోయింది. నా కంపెనీలో గత కొంతకాలంగా జీతం ఇవ్వడం లేదు. నేను స్వదేశానికి వెళ్లిపోతానంటే నాకు బదులు మరో వ్యక్తిని పనిలో పెట్టి వెళ్లమంటున్నారు. అయిదు నెలల క్రితమే నా తండ్రి చనిపోయాడు. అప్పుడు నన్ను పంపలేదు." రాజపక్సే చెప్పిన మాటలివి. మార్చ్2016లో దుబాయ్ వెళ్లిన రాజపక్సే ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ నష్టాల్లో ఉందని సంవత్సరం నుంచి సరిగ్గా జీతం కూడా ఇవ్వడం లేదు. శ్రీలంకకు చెందిన ఆ కంపెనీ షిప్పు దుబాయ్ సముద్ర జలాల్లో సంవత్సర కాలంగా ఉంటోంది. ఆ షిప్పులో సెయిలర్‌గా రాజపక్సే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాజపక్సేతో పనిచేసిన కొంతమంది భారతీయులను కంపెనీ ఇంటికి పంపేసింది. కానీ, రాజపక్సేను మాత్రం వెళ్లనివ్వడం లేదు.ఒక్కొసారి తిండి కూడా సరిగ్గాపెట్టకుండా కడుపు మాడ్చుతున్నారు.మార్చిలో తన దగ్గరున్న 10,000 దిర్హామ్స్ పంపించానని తరువాత నెల నుంచి ఒక్క పైసా కూడా పంపలేదని రాజపక్సే తెలిపాడు. ఆ మొత్తం కూడా తన తండ్రి వైద్యానికి, దహనసంస్కరాలకి ఖర్చయయ్యాని చెప్పాడు. సంవత్సరం నుంచి సముద్రానికే తన బాధను చెప్పుకుంటూ బతుకుతున్నానని వెంటనే తనను శ్రీలంకకు పంపించేయాలని కనపడిన ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాడు. తన భార్య ఐసీయూలో చికిత్స పొందుతుంటే తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని అతడు చెబుతున్నాడు. తనను ఈ నరకం నుంచి తప్పించాలని కోరుతున్నాడు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









