ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీలో రూ.10 వేలుతో చావుతో ఆట
- September 09, 2017
ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్ అయిన బ్లూవెల్ గేమ్ మోజులో ప్రాణాలు పోగొట్టుకొంటున్న వారి గురించి రోజూ ఏదొక చోట వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే.. లైవ్ లో కూడా మొసలితో ప్రాణాలను ఫణంగా పెట్టి ఆడే ఆట ఉన్నది తెలుసా..!! డబ్బు ఖర్చు పెట్టి మరీ 15 నుంచి 20 అడుగుల పొడవున్న మొసళ్లతో ఆడే ఆట చాలా ఆనందం కలిగిస్తుంది అని అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు.. దీనిని అక్కడి వాళ్ళు ఎంతో ముద్దుగా కేజ్ ఆఫ్ డెత్ గేమ్ అని అంటారు.. చావుతో సరదాగా ఆడుకొనే ఆట ఎక్కడో తెలుసా..!! ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీలో ఉన్నది. వివరాల్లోకి వెళ్తే.....
ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీలో సముద్ర గర్భం లో చావుతో సరదాగా ఆడుకొనే ఆటను సెట్ చేశారు.. ఇక్కడ సముద్ర గర్భంలో సుమారు 15 నుంచి 20 అడుగుల పొడవు ఉండే మొసళ్ళు ఉంటాయి. వీటి దగ్గరకు వెళ్లడానికి పర్యాటకులను బలమైన గాజుతో తయారు చేసిన బోనులో పెట్టి సముద్రంలోకి వదులు తారు. ఆ బోను నేరుగా మొసళ్ళ దగ్గరకి వెళ్తుంది.. అక్కడ మొసలి ఆకలితో వీరిని తినడానికి పెద్దగా నోరు తెరచుకొని వస్తుంది.. పెద్ద పెద్ద పళ్లతో గాజుని కొరికేందుకు, తోకతో గాజుని పగల గోట్టేందుకు మొసలి ఎంతగానో ప్రయత్నిస్తుంది.. ఆ సమయంలో గాజు బాక్స్ లో ఉన్న టూరిస్టులు వాటితో ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.. ఇలా వీరు సముద్రం లో మొసళ్ళ మధ్య 15 నిమిషాలు ఉంటారు.. అలా మొసళ్ళ దగ్గరకి వెళ్లడానికి పర్యటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.. ఆ 15 నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటాయని సముద్రంలోకి వెళ్ళి వచ్చిన వారు చాలా సంతోషంగా చెబుతారు.. చుట్టూ నీరు.. పొడవైన మొసళ్ళు, నాచు వాటిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని జర్మన్ కు చెందిన టూరిస్టు నైలీ వింటర్ చెప్పారు.. కాగా ఇలా కేజ్ ఆఫ్ డెత్ గేమ్ ని ఆడాలంటే.. 15 నిమిషాలకు అక్షరాలా 10 వేలు చెల్లించాలి.. ఇటువంటి వాటిని చూసే అన్నారేమో మన పెద్దలు.. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







