జపాన్‌లో ముందస్తు ఎన్నికలు
- September 29, 2017
జపాన్ పార్లమెంటును ప్రధాన మంత్రి షింజో అబే గురువారం రద్దుచేశారు. ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ.. ఆయన ప్రచారాన్నీ ప్రారంభించారు. టోక్యో గవర్నర్ యురికో కొయికే నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. అబే అధికారిక ఉత్తర్వులను పార్లమెంటులో స్పీకర్ చదివిన అనంతరం సభ్యులు హర్షం ప్రకటించారు. వచ్చే నెల 22న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఉత్తర కొరియాపై ఉక్కుపాదం, కొత్త పన్నుల వ్యవస్థ ఆవిష్కరణ తదితర అంశాల్లో ప్రజల మద్దతుకోరుతూ ప్రస్తుతం అబే బరిలోకి దిగుతున్నారు. కష్టమైన పోరాటం ఈ రోజే మొదలైంది. ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదురవుతున్న సమయంలో.. అంతర్జాతీయ సమాజానికి మనం సహకరించాలి. ఈ విషయంలో ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలి. పిల్లల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి అని విలేకరులతో అబే వ్యాఖ్యానించారు. మరోవైపు కొయికే కొత్త పార్టీని బుధవారమే ఆవిష్కరించారు. శాసనకర్తలు, భిన్న రంగాలకు చెందిన నిపుణులు ఆమె పార్టీలో చేరుతున్నారు.
అబేకు ఆమె గట్టి పోటీనిస్తారని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







