యువరాజ్ సింగ్,తల్లి, తమ్ముడు పై గృహ హింస కేసు
- October 18, 2017
క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదు అయ్యింది. యువరాజ్ సోదరుడు జోరావార్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసును ఫైల్ చేసింది. యువీతో పాటు అతని సోదరుడు జోరావార్, మాతృమూర్తి షబనమ్ సింగ్‌పైన కూడా గృహ హింస కేసును నమోదు చేశారు. ఈనెల 21వ తేదీన ఈ కేసు విచారణకు రానున్నది. బిగ్‌బాస్ కాంటెస్టాంట్ ఆకాంక్షా శర్మ తరపున వాదిస్తున్న స్వాతి సింగ్ మాలిక్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యువీ తల్లి షబనమ్ కూడా ఆకాంక్షపై ఫిర్యాదు చేసిందని, ఆభరణాలు వెనక్కి ఇచ్చేయాలని ఆమె కేసు వేసినట్లు న్యాయవాది స్వాతి తెలిపారు. గృహ హింస అంటే కేవలం శరీరక హింస మాత్రమే కాదు అని, అది మానసిక, ఆర్థిక వత్తిడి కూడా అని లాయర్ తెలిపారు. తన క్లయింట్ ఆకాంక్ష వేదనకు గురి అవుతుంటే, క్రికెటర్ యువీ ఓ మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయారని లాయర్ ఆరోపించారు. బిడ్డను కనాలంటూ ఆకాంక్షపై యువీ తల్లి షబనమ్ పదపదే వత్తిడి చేసిందని, యువీ కూడా అలాగే వత్తిడి చేశాడని, తల్లికి అండగా యువీ నిలిచాడని, ఆకాంక్ష అత్త షబనమ్ చాలా డామినెంట్‌గా వ్యవహరించినట్లు లాయర్ స్వాతి తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







