కేటలోనియా ప్రభుత్వ సస్పెన్షన్, ఆరునెలల్లో ఎన్నికలు
- October 21, 2017
స్పెయిన్ నుండి విడిపోవాలన్న కేటలోనియా ప్రభుత్వ డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన స్పెయిన్ ప్రభుత్వం కేటలోనియా స్థానిక ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి అక్కడ ఆరునెలల్లో తాజా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడి మన్‌క్లోవా పాలెస్‌లో ప్రధాని మరియానా రోజరు అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాన్ని వేర్పాటు వాదంనుండి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రధాని రజోరు కేబినెట్ భేటీ అనంతరం మీడియాకు వివరించారు. మంత్రివర్గ నిర్ణయానికి పార్లమెంట్ ఎగువ సభ సెనేట్ ఆమోదం లభించాల్సి వుంది. స్థానిక ప్రభుత్వ వేర్పాటు వాద డిమాండ్‌తో దేశ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు వున్న కేటలోనియా భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోందని ప్రధాని రజోరు వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు మంత్రివర్గ నిర్ణయానికి ఆమోదముద్ర వేయాలని తాము సెనేట్‌ను కోరనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







