క్యాబేజి, నిమ్మకాయ సూప్
- October 29, 2017కావలసిన పదార్థాలు: క్యాబేజి (మీడియం సైజు ) - పావుభాగం (నిలువు ముక్కలుగా తరగాలి), ఉల్లిపాయ - ఒకటి (సన్నటి ముక్కలు తరిగి), వెల్లుల్లి రెబ్బలు - మూడు (మెదిపి), అల్లం తురుము - ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి చిన్నది - ఒకటి (తరిగి), పసుపు - చిటికెడు, ఆలివ్ నూనె - ఒక టేబుల్ స్పూన్, కూరగాయలు ఉడికించిన నీళ్లు - నాలుగు కప్పులు, జీలకర్ర, సోంపు, ధనియాలు (వేగించి పొడి చేయాలి) - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా, నిమ్మకాయ - ఒకటి.
తయారీ విధానం: ఆలివ్ నూనెను ఒక గిన్నెలో వేడిచేసి పసుపు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, క్యాబేజి తరుగు వేసి కాసేపు వేగించాలి. తరువాత ఉప్పు కొద్దిగా వేసి ఐదు నిమిషాలు ఉడికించి అర టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఇందులో ఉడికించిన కూరగాయల నీళ్లు పోసి, ఉప్పు, మిరియాలు వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. మిగతా మసాలా పొడి వేసి మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాక సూప్‌ను సర్వింగ్ గిన్నెలో పోసుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకుని వేడివేడిగా తాగితే ఆహా అనాల్సిందే.
తాజా వార్తలు
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు