ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్
- December 02, 2017
అమరావతి: భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు శనివారం శాసనసభ ఆమోదం తెలిపింది. గతంలో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పించిన సంగతి తెలిసిందే.
గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాడు. జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన శ్రీకాంత్ అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్, ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లు నెగ్గి ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. డిసెంబరు 13 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరిగే బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు శ్రీకాంత్ అర్హత సాధించాడు. ఈ ఏడాది తన కెరీర్లోనే అత్యుత్తమంగా ప్రపంచ పురుషుల సింగిల్స్‌లో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. శ్రీకాంత్ అసాధారణ ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదాతో గౌరవించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







