పెళ్లిపీటలు ఎక్కనున్న భావన
- December 21, 2017
సౌత్ ఫిల్మ్‌ఇండస్ర్టీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ భావన. ఈ మధ్యకాలం టాలీవుడ్‌లో ఆమెకి అవకాశాలు తగ్గినా మోలీవుడ్‌లో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌తో భావనకు మార్చి 9న ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. కాకపోతే పెళ్లి ఎప్పుడనే దానిపై నెలకొన్న సస్పెన్స్‌కి ఫుల్‌స్టాప్ పడింది. వచ్చేఏడాది జనవరి 22న వీళ్లద్దరి మ్యారేజ్ త్రిసూర్‌లోని లులు కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలను ముహూర్తం నిర్ణయించారు.
భావన- నవీన్ ఇద్దరూ ఫిల్మ్ ఇండస్ర్టీకి చెందినవారే! ఇరు ఫ్యామిలీల సభ్యులు, దగ్గరి బంధువులు హాజరుకానున్నారు. సినీ పరిశ్రమకి చెందినవాళ్లని ఎవరినీ ఇన్వైట్ చేయలేదట. ఇటీవల షూటింగ్ ముగించుకుని ఇంటికి కారులో వెళ్తున్న భావనపై డ్రైవర్ సహా కొందరు వ్యక్తులు లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే! ఈ ఘటన జరిగిన కొన్నివారాలకే కన్నడ ప్రొడ్యూసర్ నవీన్‌తో భావనకు నిశ్చితార్థం జరిగింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







