సౌదీ అరేబియాలోబాలుడితో సిగరెట్ తాగించే వీడియో వైరల్..నిందితుడి అరెస్ట్..
- March 12, 2018
రియాద్: బాలల హక్కులు పుస్తకాలకే పరిమితం కాదక్కడ ...పిల్లలపై సరదాలు ..వెకిలి వేషాలు వేస్తే ఎంతటివారినైనా వదలరు ..తాట తీస్తారు. గత రెండు రోజులుగా సౌదీఅరేబియాలో ఓ వీడియో దేశమంతా చక్కర్లు కొడుతుంది. కేవలం 10 సెకన్ల నిడివి గల ఈ వీడియోలోని ఓ యువకుడు తన బంధువులకు చెందిన ఓ బాలుడి నోట్లో సిగరెట్ పెట్టి కాల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ బాలుడు పడుతున్న అవస్థను చూస్తూ రాక్షసానందం పొందుతున్నాడు. నిందితుడితోపాటు అదే గదిలో ఉన్నమరో వ్యక్తి పగలబడి నవ్వుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వారు కామెడీ కోసం చేస్తే అది వారి పాలిట ట్రాజడీగా మారింది. బోలెడు లైకులు..కామెంట్లు వస్తున్నాయని మురుసుకొనేలోపున ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. స్పందించిన అధికారులు నిందితుడి జాడ తెలిస్తే చెప్పాలని ప్రకటించారు. మరుసటి రోజే నిందితుడికి సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై పలు కేసులు నమోదు చేశారు. ముక్కు పచ్చలారని బాలుడిని చిన్నతనం నుంచే పాడైపోయేలా ప్రయత్నం చేయడమే కాక ఆ వెకలి చేష్టలను సోషల్ మీడియా ద్వారా నిబంధనలకు విరుద్ధంగా సమాచార పంపిణీకి పాల్పడ్డాడని నింధితులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







