యువన్ శంకర్ రాజా నిర్మాతనవుతా!
- November 30, 2015
మంచి కథ లభిస్తే సినిమా తీస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. సంగీత దర్శకులు నిర్మాతలుగా మారుడం ఇవ్వాళ కొత్తేమీ కాదు. సంగీత జ్ఞాని ఇళయరాజా కూడా నిర్మాతగా చిత్రాలు చేశారు. ఇక ఈ తరం విషయానికి వస్తే సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నిర్మాతగా మారడంతో పాటు కథానాయకుడిగాను విజయాలను అందుకుంటున్నారు. అదే విధంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ కూడా చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. తన చిత్రానికి తనే కథను సిద్ధం చేసుకుంటున్నారు కూడా. తాజాగా మరో ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా నిర్మాతనవుతానంటున్నారు. ఈయన ఇటీవల ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తనకు నటుడవ్వాలనే కోరిక ఇంత వరకూ కలగలేదన్నారు. అయితే నిర్మాతగా చిత్రాలు చేయాలనే ఆశ మాత్రం ఏర్పడిందని అన్నారు. అందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మంచి కథ లభిస్తే వెంటనే సినిమా తీస్తానని యువన్ అన్నారు. మరో విషయం ఏమిటంటే తనకు పరిపూర్ణ విజయం లభించిదని భావించడం లేదు. అలాంటి విజయం కోసం నిత్యం భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అని యువన్ శంకర్ రాజా అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







