బిగ్ బాస్2 లో ఛాన్స్..
- May 09, 2018
హిందీ, తమిళంలోనే కాకుండా దాదాపు 13 భాషల్లో క్లిక్ అయిన బిగ్ బాస్ తెలుగులో కూడా క్లిక్ అయింది. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీజన్1 కి హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ షోని ఆధ్యంతం రక్తి కట్టించి సక్సెస్ చేయండంలో ప్రధాన పాత్ర వహించారు. ఇక ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కూడా ఆ తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. షో విన్నర్ బాలాజీ 50 లక్షలు ప్రైజ్‌మనీ దక్కించుకుని విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మరి అదే ఊపుతో సీజన్ టూ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి మరికొన్ని మార్పులు చేర్పులు చేశారు. మరింత ఆకర్షణీయంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. షోకి వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నానీ అలరించబోతున్నాడు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా పాల్గొనవచ్చని షో నిర్వాహకులు తెలియజేస్తున్నారు. సీజన్2 కి ఆడిషన్స్ మొదలైనట్లు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోమోలో దీక్షాపంథ్ స్టూడెంట్స్‌కి పాఠాలు చెబుతుంటుంది. తన హాట్ లుక్స్ మరియు హస్కీ వాయిస్‌తో అలరిస్తుంది. బిగ్‌బాస్ షోకి సామాన్యులకు స్వాగతం అంటూ ఓ వాయిస్ వినిపిస్తుంది. అంటే బిగ్‌బాస్ హౌస్ సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేయబోతున్నారన్నమాట. మరికెందుకు ఆలస్యం మీరూ.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







