ఇబ్బందుల్లో ఒమన్ కన్‌స్ట్రక్షన్
- December 08, 2015
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఆయిల్ ధరల తగ్గుదల వంటివి ఒమన్‌లోని కన్‌స్ట్రక్షన్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాగే నిర్మాణ రంగంలో కార్మికులు అందుబాటులో లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఒమనేతరుల్ని ఒప్పంద కార్మికులుగా దిగుమతి చేసుకునేందుకు నిబంధనలు అడ్డంకిగా మారడంతో ఒమన్ కన్‌స్ట్రక్షన్ రంగం ఆందోళన చెందుతోంది. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న 200,000 మంది ఒమనియన్ వర్కర్స్‌లో 26 శాతం కన్‌స్ట్రక్షన్ రంగంలోనే ఉన్నారు. వీరంతా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఒమన్ సొసైటీ ఆఫ్ కాంట్రాక్టర్స్ సీఈఓ షాహస్వర్ అల్ బలుషి చెప్పారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ మాత్రం కన్‌స్ట్రక్షన్ రంగం యాక్టివ్‌గా ఉందనీ, ఎలాంటి ఇబ్బందుల్లేవని చెబుతోంది. ఉద్యోగాల కల్పనలో ఒమనియన్లకు ప్రాధాన్యతనివ్వాలనే నిర్ణయం కొన్నేళ్ళ క్రితమే జరిగిందనీ, దాన్నుంచి వెనక్కి తగ్గలేమని అంటోంది ప్రభుత్వం. అయితే ఈ పరిస్థితి కొనసాగడం నిర్మాణ రంగానికి మంచిది కాదని నిర్మాణ సంస్థలు చెప్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్‌స్ట్రక్షన్ రంగంలో ఒమనియన్ల సంఖ్య పెంచాలనుకోవడం కూడా సబబు కాదని ఆ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ సెక్టార్‌లో166,521 స్కిల్‌డ్ ఒమనియన్ వర్కర్స్ ఉండాలనేది టార్గెట్ అయితే 142400 మంది మాత్రమే యాక్టివ్, నాన్ యాక్టివ్ ఉద్యోగార్థులున్నారని సంస్థలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







