అష్టకష్టాలు పడుతున్న యెమెన్ నిర్వాసితులు.. సాయం కోసం ఎదురుచూపులు
- October 22, 2018
అడెన్ : యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్‌కు మానవతా సాయం అందక పోవడం తో అక్కడ దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిర్వా సితులైన వేలాదిమంది యెమెన్ ప్రజలు శీతా కాలంలో ఆరుబయట ఎముకలు కొరికే చలిని తట్టుకుని జీవనం సాగించాల్సి వస్తుంది.. అమెరికా అండదండలతో సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి యమెన్‌పై జరుపుతున్న దాడుల్లో దక్షిణ ఓడరేవు పట్టణమైన అడెన్ శివార్లలో పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. వీరు ఎర్ర సముద్రం తీరప్రాంత పట్టణమైన హొడైడాకు వలస వచ్చారు. ఇక్కడ నిత్యావసరాలైన నీరు, విద్యుత్ వంటివి లేకపోవడంతో ఏడారి ప్రాంతంలో జీవించడానికి వారు అష్టకష్టాలు పడుతున్నారు. తమను తక్షణమే ఆదుకోవాలని వారు అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. అడెన్ శివార్లలో నిర్వాసితులు గుడిసెల్లో వుంటున్నారు. తుపానులు, అత్యంత శీతల పరిస్థితులతో ఇప్పటికే తాము ఇబ్బందులు పడుతున్నామని, శీతాకాలం పూర్తి స్థాయిలో వస్తే తమ కష్టాలు మరింత పెరుగుతాయని అడీబ్ ఒమర్ అనే నిర్వాసితుడు పేర్కొన్నారు. ఎడారి ప్రాంతంలో అత్యంత శీతలమైన రాత్రుళ్ళు భరించడం కష్టమని అన్నారు. ఇప్పటికే సరైన ఆహారం లేక పిల్లలు, వృద్ధులు బాధ పడుతున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







