యు.ఏ.ఈ లో నేటి నుంచి నిషేధం లేని కార్మిక చట్టాలు
- January 03, 2016
ఉద్యోగ ఒప్పందాలు , పని అనుమతులు , కార్మికుల నియమాలు, తొలగింపులు తదితర కొత్త చట్టాలు నేటి నుంచి అమలులోనికి రానున్నాయి. ఈ నూతన నిబంధనల ప్రకారం ఇక 6 నెలల కార్మిక నిషేధం ఉండదు. కార్మికుడు , యజమానికి మధ్య ఒక పరస్పర అవగాహనతో ఉద్యోగ తొలగింపు ఉంటె, 6 నెలల నిషేధం ఉండదు. కొత్త నియమాల ప్రకారం యజమాని మరియు ఉద్యోగుల మధ్య ఒక శక్తివంతమైన ఉత్పాదక సంబంధం బలోపేతం కావడానికి రూపకల్పన చేశారు. ఇరు పక్ష్యాల్ మధ్య ఉన్నసమ్మతిదారుడు స్థానికంగా గాని , విదేశాల నుంచి కార్మికులను నియమించుకొనే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రామాణిక కార్మిక ఒప్పందాలకు సంబంధించినవి ఉండాలి.
కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి యజమాని ఒక కోటా ను పొంధడానికై దరఖాస్తు చేయాల్సి ఉంది. ఆ దరఖాస్తులో తాను కార్మికునికి ఇవ్వబోయే ఉద్యోగం గురించి ఒక సంపూర్ణ వివరణతో పాటు రెండు పక్ష్యాల విధులు హక్కులను గూర్చి పొందుపరచాలి. దీనిని ' తశ్హెల్ కేంద్రం ' ద్వారా సమర్పించాలి. కార్మికులు కనుక యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో ఉంటె , యజమాని అనుమతిపత్రంతో పాటు నియమించబడిన కార్మికుని సంతకం తీసుకోవాలి. యజమాని కార్మికునికి సంబంధించిన వర్క్ పర్మిట్ కోసం ఒక పత్రాన్నిజత చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలు పూర్తి కాబడిన తర్వాత కార్మికుడు లేక కార్మికురాలు 14 రోజులలో ఆ వర్క్ కాంట్రాక్ట్ పై సంతకం చేయాలి.
కొత్త ఉపాధి పరిమితి కాల ఒప్పందాలు :
* గడువు ముగిసినప్పటకి ఒప్పందం పునరుద్దరణ కాబడక పోవడం
* యజమాని కార్మికుడు పరస్పర అంగీకారంతో 6 నెలల కాలాన్ని పూర్తి చేయడం
* యజమాని ఉద్యోగ ఒప్పందం ప్రోస్థాహించడం.
అపరిమిత కాలంలో ఒప్పందాలు
* కార్మికుడు 6 నెలల కాలం పని చేసి ఉంటె, ఇరువురి అంగీకారంతో ( యజమాని , కార్మికుడు )
ఒప్పందంను రద్దు చేసుకోవచ్చును.
* రెండు పక్ష్యాలాలో ఎవరైనా ఒకరు పని ముగిస్తున్నామని అవతలవారికి నోటీసు ఇవ్వడం
* యజమాని కార్మికుని తొలగింపునకు ముందే లేక ఇతర కారణంగా ఒప్పందం రద్దు కాబడుతుంది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







