ఏపీని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం-బాబు
- January 04, 2016
గుంటూరు, తెనాలి:,హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరాలుంటే మూడోనగరంగా సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అదే రీతిలో అమరావతిని కూడా తీర్చిదిద్దుతానని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇవాళ జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు..రాష్ట్రాన్ని విభజించి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకందరికి తెలుసు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. రాజధాని ఎక్కడ ఉంటుందో కూడా చెప్పకుండానే రాష్ట్రాన్ని విభజించారన్నారు. అన్ని ఇబ్బందులును ఎదుర్కొన్ని రాష్ట్రాన్ని అభివృద్దిబాటలో నడిపిస్తాను ఇది తథ్యం..ఇందులో ఏ అనుమానం లేదని ఆయన చెప్పారు. పట్టుదల క్రమశిక్షణ లేనిదే ఏం సాధించలేమని చెప్పారు. ఈరోజు ఆ ఉద్ధేశంతోనే జన్మభూమి మాఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బాబు చెప్పారు. విభజన హేతుబద్ధత లేకుండా జరిగింది. కట్టుబట్టలతో మనం ఇక్కడికి వచ్చామన్నారు. రాజధాని లేదు, ఇండస్ట్రీలు లేవు, కాలేజీలు లేవు. విభజన జరిగిన సంవత్సరం తరువాత చూస్తే 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. అయితే మనకు దృడ సంకల్పం ఉంది..దాంతోనే ముందుకు సాగుతామని చంద్రబాబు చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా ఏపీని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని..ఇందులో ఎటువంటి అనుమానం లేదని బాబు తేల్చిచెప్పారు. నెంబర్ వన్‌గా చేసేంత వరకు నిద్రపోకుండా పని చేస్తామన్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలిని కలుపుతూ 220కి.మీ ఔటర్ రింగురోడ్డు వస్తోందని చెప్పారు. భవిష్యత్తులో మహానగరం కానుందని చంద్రబాబు తెలిపారు. ఇదివరకు హైదరాబాద్‌ను అభివృద్ధిచేసిన అనుభవం నాకుంది. ఆ రోజు హైదరాబాద్‌లో 165కి.మీ దేశంలో ఎక్కడా లేనటివంటి ఔటర్ రింగురోడ్డుతో అభివృద్ధి చేశామన్నారు. ఆరోజుల్లోనే 6లైన్ రోడ్డును నిర్మించామన్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







